హిందువులను కించపరిస్తే సహించం : సీఎం జగన్‌కు సోము వీర్రాజు వార్నింగ్

శనివారం, 23 జనవరి 2021 (13:56 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు గట్టి వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలోని హిందూ ప్రజలను చులకనగా చూస్తే సహించబోమని హెచ్చరించారు. 

సమాజంలో ఉండే అందరినీ హిందువులు గౌరవిస్తారని, హిందువులు మతతత్వ వాదులు కారని స్పష్టం చేశారు. బీజేపీపై దాడి చేస్తే హిందువులపై దాడి చేసినట్టేనని అన్నారు. ఈ అంశంపై తాము ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని, హిందువులను మతతత్వ వాదులుగా చిత్రీకరించడం పట్ల రథయాత్రలతో ప్రజలకు వివరిస్తామని తెలిపారు.

ఏపీలో గతకొంతకాలంగా జరుగుతున్న ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటలనపై బీజేపీ ఫిబ్రవరి 4 నుంచి రథయాత్ర చేపడుతోంది. వారం రోజుల పాటు సాగే ఈ యాత్ర తిరుపతి కపిలతీర్థం నుంచి విజయనగరం జిల్లా రామతీర్థం వరకు నిర్వహిస్తారు. 

ఈ యాత్రకు జనసేన కూడా మద్దతిస్తోంది. నెల్లూరు, శ్రీశైలం, గుంటూరు, విజయవాడ, అంతర్వేది, పిఠాపురం వంటి ప్రాంతాల మీదుగా ఈ రథయాత్ర రామతీర్థం చేకుంటుంది. కాగా, ఇటీవల తిరుపతిలో బీజేపీ నిర్వహించిన యాత్రపై పోలీసులు లాఠీ ఝుళిపించిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు