చిరంజీవికి బిజెపి బంపర్ ఆఫర్.. ఏంటది?

బుధవారం, 16 అక్టోబరు 2019 (22:11 IST)
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ పదవీ కాలం ముగిసిపోయిన తరువాత రాజకీయాలకే దూరంగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ ముందుకెళుతున్నారాయన. ఎపి సిఎంను చిరంజీవి కలవడాని కన్నా ముందు ఆయన వైసిపిలో చేరిపోతారన్న ప్రచారం సాగిపోయింది. కానీ చిరంజీవి మాత్రం ఆ ప్రచారానికి స్పందించలేదు.
 
చిరంజీవి చేరితే జాతీయస్థాయి పార్టీలో చేరుతారన్న ప్రచారం మరోవైపు ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవి ఢిల్లీకి వెళ్ళారు. అది కూడా ఉపరాష్ట్రపతి నివాసంలో ఆయనతో కలిసి సైరా సినిమా చూసేందుకు వెళ్ళారు. సినిమా ప్రదర్సనకు ప్రధానితో పాటు పలువురు కేంద్ర పెద్దలకు ఆహ్వానం కూడా అందింది. 
 
ఉపరాష్ట్రపతి ఇంటికి వెళ్ళే సమయంలో మార్గమధ్యంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్సి రామ్ మాధవ్, ఎంపి సిఎం రమేష్‌లు చిరంజీవితో ఉన్నారు. అయితే రాంమాధవ్ చిరంజీవితో రాజకీయాల గురించి మాట్లాడారట. ఎపిలో బిజెపి బలోపేతం దిశగా వెళుతోందని.. ఇలాంటి సమయంలో బిజెపిలో కీలక పదవి ఇవ్వడానికి పార్టీ సిద్థంగా ఉందని చెప్పారట. ఆ పదవికి మీరైతే సరిగ్గా సరిపోతారని చిరంజీవికి చెప్పారట రాం మాధవ్. అయితే చిరంజీవి మాత్రం ఏ విషయాన్ని రాం మాధవ్‌తో స్పష్టం చేయలేదట. తరువాత మాట్లాడతానని కనుసన్నలతోనే చెప్పేశారట చిరంజీవి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు