ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఆ పార్టీలు ప్రకటించాయి.
విజయవాడలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో బీజేపీ, జనసేన పార్టీలు ఈ నిర్ణయాన్ని ప్రకటించాయి. రెండు పార్టీలు పొత్తు నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత తొలి సమన్వయ కమిటీ సమావేశం విజయవాడలో జరిగింది.
రెండు పార్టీలకు సంబంధించిన సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి రాజధాని రైతుల వద్దకు వెళ్లి వారికి భరోసా కల్పించాలని సమన్వయ కమిటీ నిర్ణయించింది. రాజధాని మార్పులపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించామనే ప్రచారాన్ని కమిటీ ఖండించింది.