విశాఖలో టీడీపీ ఎమ్మెల్యేలు మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిపై సోము వీర్రాజు స్పందిస్తూ, బీసీ వర్గానికి చెందిన ప్రధాని, నీచ కులానికి, గాండ్ల కులానికి చెందిన మోడీ దేశానికి ఎంతో చేస్తున్నారని.. ఆయనపై విశాఖలో ఫ్లెక్సీలు ఏర్పా టు చేయడం బాధాకరమన్నారు.
దీనిపై టీడీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేశారు, ఒక కులాన్ని నీచ కులమని ఎలా సంభోదిస్తారని నిలదీశారు. వీర్రాజు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ సూచించారు. మోడీది నీచకులమని కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యానించారని, దానినే తాను గుర్తుచేశానని వీర్రాజు చెప్పారు.