అయితే, పలు సందేశాత్మక చిత్రాలు తీసిన దర్శకుడు కొరటాల శివ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి చేసిన ట్వీట్ ఇపుడు సంచలనంగా మారింది. విభజన హామీల అమలు విషయంలో కేంద్రం చూపిస్తున్న మొండి వైఖరిపై దర్శకుడు కొరటాల శివ మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని బుధవారం కేంద్రం తేల్చేయడం, తెలంగాణ అడుగుతున్న పలు డిమాండ్లను కూడా తోసిపుచ్చడంపై సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీపై నేరుగా కామెంట్స్ చేశారు.
ఇటీవల విడుదలైన తన సినిమా టీజర్‌లో ముఖ్యమంత్రి పాత్రలో మహేశ్ చెప్పిన డైలాగ్స్‌ను ప్రధానికి అన్వయిస్తూ తన ట్విట్టర్, ఫేస్‌బుక్ ఖాతాల్లో ఓ పోస్ట్ పెట్టారు. "ఆంధ్రప్రదేశ్‌కు గతంలో ఇచ్చిన హామీలను మనమంతా కలిసి ప్రధాని నరేంద్ర మోడీకి గుర్తుచేసి.. ఆయనను మనిషిగా మారుద్దాం.. తెలుగు రాష్ట్రాలు భారత్‌లో అంతర్భాగం అని మీరు నిజాయితీగా భావిస్తున్నారా సార్..?" అంటూ మోడీని ఉద్దేశించి కొరటాల శివ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ పెట్టారు.
ఏపీకి హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పేసిన వెంటనే మోడీపై సోషల్‌మీడియాలో కొరటాల శివ పై డైలాగ్‌ను పోస్టు చేస్తూ తన స్పందన తెలియజేశారు. ఆయన చేసిన పోస్ట్‌ను నెటిజన్లు షేర్ చేసుకుంటున్నారు. సరైన సమయంలో సరైన డైలాగ్‌తో పోస్ట్ పెట్టారంటూ, ఏపీ హక్కుల గురించి ప్రశ్నించారంటూ ఆయనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.