నేడు ద్రౌపది ముర్ము నామినేషన్ - పత్రాలపై సంతకం చేసిన సీఎం రమేష్

శుక్రవారం, 24 జూన్ 2022 (08:16 IST)
రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం రూపొందించిన నామినేషన్ పత్రంలో సంతకం చేసే గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక్క సీఎం రమేష్‌కు మాత్రమే దక్కింది. ఈయన టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడుగా ఎంపికై ఇపుడు భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. 
 
ఈ క్రమంలో రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసే అభ్యర్థులను రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన 50 మంది ప్రతిపాదించాల్సివుంది. మరో 50 మంది బలపరచాల్సివుంది. ఈ క్రమంలో ముర్ము నామినేషన్‌కు బీజేపీ ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేసింది. ఇందులోభాగంగా, ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించే వారి జాబితాలో ఏపీకి చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు దక్కింది. 
 
బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ద్రౌపది ముర్మును ఎన్డీయే అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ గురువారమే సీఎం రమేష్ ప్రతిపాదన పత్రంపై సంతకం చేశారు. ఇలా ముర్ము అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించే అవకాశం దక్కిన నేతల్లో ఏపీ నుంచి సీఎం రమేష్‌ ఒక్కరే ఉండటం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు