ఏటీఎంలోకి సాధారణంగా డబ్బు తీసుకునేందుకు కస్టమర్లు వెళ్తూ వుంటారు. అయితే ఈసారి ఏటీఎంలోకి కస్టమర్లు కాకుండా బుల్ వచ్చింది. ఎక్కడెక్కడో తిరిగి అలిసిపోయిన ఆ వృషభం.. ఏటీఎంలోని ఏసీ హాయిగా కూర్చుని సేదతీరింది. ఈ ఘటన అనంతపురం జిల్లా పామిడిలో కనిపించింది. ఓ ఏటీఎం వద్ద సెక్యూరిటీగా ఎవరూ లేకపోవడం, తలుపు తీసుండటంతో ఆ ఎద్దు హాయిగా లోనికి వచ్చి పడకేసింది.