Manoj: తండ్రి, గురువు అయిన మోహన్ బాబుకు శుభాకాంక్షలు తెలిపిన మంచు మనోజ్

దేవీ

శుక్రవారం, 5 సెప్టెంబరు 2025 (17:58 IST)
Manchu Manoj - Mohan babu
ప్రతి అడుగులో నన్ను నడిపించిన ఉత్తమ గురువుకు, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మంచు మనోజ్ ఓ ఫొటో తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  నాన్న గారు, మరియు మన జీవితాలను తీర్చిదిద్దుతున్న అద్భుతమైన ఉపాధ్యాయులందరికీ, ఈ ప్రత్యేక రోజున నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ తెలిపారు. దీనికి సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. తాజాగా మనోజ్ మిరాయ్ అనే సినిమాలో విలన్ గా నటించారు. ఆ సినిమా ట్రైలర్ కు అనూహ్యస్పందన వచ్చింది.
 
ఇటీవలే కలిసిన మనోజ్ ఈ ట్రైలర్ చూశాక ఇండస్ట్రీనుంచి మంచి అప్లాజ్ వచ్చింది. నా ఫ్యామిలీ నుంచి కూడా గుడ్ రెస్పాన్స్ వచ్చిందని అన్నారు. ఈ ట్రైలర్ తర్వాత తమిళంలోనూ మంచి ఆఫర్లు వస్తున్నాయని చెప్పారు. విశేషం ఏమంటే.. మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం ఓటీటీలోకి వచ్చింది. అదే టైంకు మనోజ్ నటించిన మిరాయ్ సినిమా థియేటర్లలోకి రాబోవడం కూడా విశేషం. ఇదంతా కాలమహిమ అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
 
ఇదిలా వుండగా, అంతకుముందు మంచు ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసిందే. ఆ కుటుంబంలో మంచు విష్ణు, మోహన్ బాబు, మనోజ్ మధ్య జరిగిన పంచాయితీ అందరికీ తెలిసిందే. పోలీస్ స్టేషన్ల వరకు తిరిగి వచ్చారు. ఆస్తుల పంపకం ఒకవైపు ఇగో మరోవైపు కేంద్రంగా కుటుంబ గొడవలు జరగడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొద్దికాలం ఈ గొడవ సర్దుమణిగాక ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు. నటుడిగా చాలా కాలం గేప్ తెచ్చుకున్న భైరవం సినిమా వచ్చింది. అందులో ముగ్గురు కథానాయకుల్లో మనోజ్ కు మంచి అప్లాజ్ వచ్చింది.

వెబ్దునియా పై చదవండి