బుట్టా రేణుకకు చంద్రబాబు హ్యాండ్... జగన్ ఫ్లెక్సీలతో సీటుకోసం వెంపర్లాట

శనివారం, 16 మార్చి 2019 (16:37 IST)
కర్నూలు ఎంపి బుట్టా రేణుక సొంత గూటికే వెళ్ళేందుకు సిద్ధమైపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపిగా గెలిచిన బుట్టా రేణుక ఆ తరువాత టిడిపిలోకి వెళ్లిపోయారు.

జగన్ మోహన్ రెడ్డితో తలెత్తిన కొన్ని విబేధాల కారణంగా రేణుక పార్టీని వీడారంటూ ఆమధ్య వాదనలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత టిడిపిలోనే కొనసాగుతూ వచ్చారు. కానీ తాజాగా బుట్టా రేణుకకు ఎంపి సీటు దక్కకపోవడంతో మళ్ళీ ఆమె తన సొంత గూటికే వెళ్ళిపోవాలన్న నిర్ణయానికి వచ్చేశారట.
 
కర్నూలుకు చెందిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి టిడిపిలోకి వెళ్ళడంతో వారికి సీటు కన్ఫామ్ అయ్యింది. ఇక బుట్టా రేణుకకు మొండిచేయి మిగిలింది. దీంతో సీటు కోసం మళ్ళీ బుట్టా రేణుక వైసిపిలోకి వెళ్ళిపోవాలన్న నిర్ణయానికి వచ్చేశారట. కానీ జగన్ ఎట్టిపరిస్థితుల్లోను బుట్టా రేణుకను పార్టీలోకి తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఒక పార్టీ జెండాపై గెలిచి మరో పార్టీలోకి వెళ్లినవారు తిరిగి వచ్చినా వారిని ఎంతమాత్రం చేర్చుకునే అవకాశం లేదంటున్నారు. పైగా బుట్టా రేణుకపై ముందుగానే గుర్రుగా ఉన్న అధినేత జగన్ ఎట్టి పరిస్థితుల్లోను చేర్చుకునే అవకాశం కనిపించడం లేదు. 
 
కానీ బుట్టారేణుక మాత్రం అప్పుడే జగన్ మోహన్ రెడ్డికి చెందిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి తన ఫోటోలను ముద్రించి ప్రచారం చేసుకుంటున్నారు. స్వచ్ఛభారత్ అంటూ నగరంలో అప్పుడే నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. టిడిపి ఎంపి ఎప్పుడు వైసిపిలో చేరారో నేతలకే అర్థం కావడం లేదు. ఎన్నికల సమయంలో ఇదంతా మామూలేనంటూ కొంతమంది లైట్ తీసుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు