నటి, నిర్మాత రేణు దేశాయ్ రేబిస్ టీకా తీసుకున్నారు. తాను టీకా తీసుకుంటున్న ప్రక్రియను వీడియో రికార్డ్ చేసి.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. జంతు సంరక్షణ, వీధి కుక్కల సంక్షేమం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తారో అందరికీ తెలిసిందే. సాధారణంగా టీకాలు తీసుకున్నప్పుడు ఫోటోలు లేదా వీడియోలు రికార్డ్ చేయని రేణు దేశాయ్.. ఈసారి మాత్రం అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఇలా చేశానని తెలిపారు.