పగబట్టిన పాము తలబాదుకు చస్తుందా? ఇక్కడ చూడండి పిల్లపాములు బుస్(వీడియో)

శుక్రవారం, 23 జూన్ 2017 (14:44 IST)
పాములు పగపడతాయా....? తమకు హాని చేసినవారిని చంపేదాకా నిద్రపోవా? ఒకవేళ అనుకున్న టైంకి తమ ప్రతీకారం తీర్చుకోలేకపోతే తలబాదుకుని చచ్చిపోతాయా? ఇలాంటి ప్రశ్నలు జనం మదిలో వుంటాయి. ముఖ్యంగా మన తెలుగు ప్రజలు పాములు... అదికూడా నాగుపాములంటే చాలా భయంతో వణికిపోతారు. అవి పగ పడతాయని అనుకుంటారు. కానీ ఇదంతా అవాస్తవం అంటారు పాములపై పరిశోధనలు చేసేవారు. 
 
ఇదిలావుంటే చిత్తూరు జిల్లా పెదపంజాని మండలంలోని గ్రామంలోని ఓ మామిడి తోట పక్కగా రెడ్డప్ప అనే రైతు వస్తున్నాడు. అతడిని ఓ నాగుపాము కాటు వేయబోయింది. దీనితో అతడు దాన్ని కర్రతో కొట్టి చంపాడు. ఆ పామును అలా చంపేయగానే వరుసగా పుట్టలోంచి 25 పిల్లపాములు బయటకువచ్చి బుస్ మంటూ పడగవిప్పి కోపాన్ని ప్రదర్శించాయి. వీటిని చూసిన రైతులు ఈ పాములు పెరిగి పెద్దవై తమపై ప్రతీకారం తీర్చుకుంటాయేమోనని భయపడిపోయారు. దాంతో వాటన్నిటినీ వరసబెట్టి చంపేసి తగులపెట్టారు. చూడండి వీడియో...

వెబ్దునియా పై చదవండి