ఆన్‌లైన్‌లో శ్రీవారి లడ్డూల విక్రయమా?

మంగళవారం, 13 డిశెంబరు 2022 (08:32 IST)
ఎంతో ప్రసిద్ధిగాంచిన అమృతంతో సమానంగా భావించే శ్రీవారి ప్రసాదాల్లో ఒకటైన లడ్డూలను ఆన్‌లైన్‍‌లో విక్రయిస్తున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై తిరుమల తిరుపతి  దేవస్థానం (తితిదే) బోర్డు స్పందించింది. 
 
శ్రీవారి లడ్డూలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. భక్తులు వీటిని నమ్మొద్దని కోరారు. తితిదే వెబ్‌సైట్ ద్వారా భక్తులు దర్శన టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలోనే అదనపు లడ్డూలను బుకు చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. 
 
దర్శనంతో సమంబంధం లేకుండా లడ్డూలు బుక్ చేసుకోవచ్చని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని, ఇలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని తితిదే అధికారులు హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు