మిలీనియం టవర్, ఆయా శాఖలు చూసి మిగతా భవనాలకు సంబంధించి కేబుల్స్, సాఫ్ట్‌వేర్, ఆన్‌లైన్ సౌకర్యం చూడాలని ఆదేశాల్లో పేర్కొంది. హెచ్‌వోడీ కార్యాలయం, సచివాలయం ఉద్యోగులు వచ్చిన వెంటనే పని చేసే విధంగా సౌకర్యాలు ఉండాలని సూచించింది. ప్లగ్ అండ్ ప్లేగా ఉండాలని ఆదేశించింది.
ఉగాది తర్వాత నుంచి తరలింపు ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో హెచ్‌వోడీలు, సచివాలయం, రాజ్‌భవన్, ఇతర కార్యాలయాలన్నింటినీ తరలించేందుకు అధికారులు షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. ఏప్రిల్ 16వ తేదీ నాటికి తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.