ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అస్తవ్యస్తమైన పరిపాలన సాగుతోందని, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు డాక్టర్ చింతా మోహన్ విమర్శించారు. డ్రగ్స్, గంజాయి యధేచ్ఛగా రవాణా సాగుతోందని, మహిళలు, బాలికపై లైంగిక దాడులు జరుగుతున్నాయని చెప్పారు. అయితే, ఇవన్నీ జరుగుతోంది... రాష్ట్రంలో నిరుద్యోగం వల్లనే అని ఆయన సూత్రికరించారు. యువతకు ఉద్యోగాలు లేకపోవడం వల్లే ఇలాంటివి సంభవిస్తున్నాయని చెప్పారు.