కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తిరుపతి పర్యటన ఖరారైంది. మూడు రోజులపాటు తిరపతిలో అమిత్‌షా పర్యటించనున్నారు. ఈనెల 13న తిరుపతికి అమిత్‌షా రానున్నారు. 14న ఉదయం నెల్లూరులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు. అదే రోజు మధ్యాహ్నం తిరుపతిలో సదరన్ జోనల్ సీఎంల భేటీలో పాల్గొననున్నారు. ఈనెల 15న శ్రీవారి దర్శనం అనంతరం అమిత్‌షా తిరుగు ప్రయాణమవుతారు.
తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో హోం మంత్రి అమిత్ షా సమావేశం కానున్నారు. దీనితోపాటు ఏపీ సీఎం కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమస్యలను, ఆర్ధికమైన ఇబ్బందులను హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లేందుకు ఏపీ సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నతాధికారులతో సమీక్షలు జరిపి, ఒక నోట్ తయారు చేసి అందించాలని చూస్తున్నారు. కొత్తగా ఏర్పడిన ఏపీకి లోటు బడ్జెట్ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు కేంద్రం సహకరించాలని కోరనున్నారు.