ఫీజ్ కట్టలేదని.. లేటుగా వచ్చారని, హోమ్ వర్క్ చేయలేదని.. నగ్నంగా నిలబెట్టారు..

గురువారం, 27 డిశెంబరు 2018 (15:44 IST)
విద్యార్థులను నగ్నంగా నడిరోడ్డుపై నిలబెట్టిన విద్యా సంస్థ లైసెన్స్‌ను రద్దు చేశారు. హోమ్ వర్క్ చేయకుండా పాఠశాలకు వచ్చారనే కారణంతో కొందరు విద్యార్థులను నడిరోడ్డుపై నగ్నంగా నిలబెట్టిందో విద్యా సంస్థ. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు చైతన్య భారతి పాఠశాలలో చోటుచేసుకుంది. 
 
విద్యార్థులు హోమ్ వర్క్ రాసుకురాలేదని.. ఐదుగురు విద్యార్థుల బట్టలను ఊడదీయించిన టీచర్లు.. వారిని అందరూ చూసేలా స్కూలుకు వెలుపల నిలబెట్టారు. ఈ ఘటనపై వారి తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత రావడంతో విద్యాశాఖ స్పందించింది. 
 
ఈ ఘటనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు చైతన్య భారతి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. పాఠశాలలోని విద్యార్థులను ఇతర పాఠశాలల్లో చేర్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. హోమ్ వర్క్‌లు చేసుకోరాని పక్షంలో ఇలాంటి కఠినమైన శిక్షలను అమలు చేయడం ఏమిటని విద్యాశాఖ సీరియస్ అయ్యింది.
 
స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసింది. స్కూలుకు లేటుగా వస్తున్నారని, హోమ్ వర్క్ చేయలేదని, ఫీజులు సరిగ్గా కట్టట్లేదని చెప్తూ టీచర్ ఐదో తరగతి విద్యార్థుల బట్టలూడదీసి మండుటెండలో నిలబెట్టారని.. చిన్నారుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు