ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రానున్న వనమహోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు సంయుక్తంగా పాల్గొననున్నారు. ఈ నెల 30న పల్నాడు జిల్లా కేంద్ర ప్రాంతమైన కాకానిలోని జేఎన్‌టీయూ కలాలాల ప్రాంగణంలో వేడుకలు నిర్వహించనున్నారు.
ఇరువురు నేతలు బహిరంగ సభకు సిద్ధమవుతున్న తరుణంలో వారి పర్యటనకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఏర్పాట్లు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. హెలిప్యాడ్, సభా వేదిక వద్ద సౌకర్యాలపై జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, పోలీసు సూపరింటెండెంట్ శ్రీనివాసరావు మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ సూరజ్, జిల్లా అటవీ అధికారి రామచంద్రరావు, ఆర్డీఓ సరోజ, తహసీల్దార్ వేణుగోపాల్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా వారి భాగస్వామ్యంతో పాలనకు గట్టి పునాది వేయడానికి.. కూటమిని బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.