నేటి నుండి వారంరోజులు తిరుపతిలో చంద్రబాబు ఉప ఎన్నికల ప్రచారం

గురువారం, 8 ఏప్రియల్ 2021 (10:54 IST)
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేటి నుంచి వారం రోజులపాటు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్‌ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని, రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకోనున్నారు.

రేణిగుంట పాత చెక్‌పోస్ట్‌ సమీపంలోని వై కన్వెన్షన్‌ సెంటర్‌లో ఉప ఎన్నికలపై నేతలతో సమీక్ష చేపట్టనున్నారు. మధ్యాహ్నం మూడున్నర గంటల తర్వాత శ్రీకాళహస్తికి చంద్రబాబు బయలుదేరనున్నారు. టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మితో కలిసి ప్రచారం చేపట్టనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు