చంద్రబాబు పెద్ద లు...: కొడాలి నాని తిట్ల దండకం

శనివారం, 16 నవంబరు 2019 (18:58 IST)
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విజ్ఞత మరిచిపోయారు. చిన్నాపెద్ద అన్న తేడా లేకుండా సంస్కారహీనంగా 'గాడు' అంటూ తిట్లు అందుకున్నారు. శనివారం సాయంత్రం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన బూతు పురాణం వినలేక విలేఖరులే చెవులు మూసుకున్నారు. ఆయన మాటలు యధాతథంగా..
 
ఇది ప్రజాస్వామ్యమేనా అని బోడేప్రసాద్, కొనకళ్లనారాయణలు అందరూ వచ్చి అడుగుతున్నారు. గతంలో వైయస్‌ జగన్‌ రెక్కల కష్టంతో గెలిపించుకున్న 23 మంది ఎంఎల్‌ ఏలను తీసుకువెళ్లి నలుగురికి మంత్రులు ఇచ్చి ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తులతో అసెంబ్లీ, సభావేదికలపై జగన్‌ ని అడ్డమైన తిట్లు తిట్టిస్తూ వెకిలినవ్వులు నవ్వుతూ పైశాచిక ఆనందం పొందిన వ్యక్తి చంద్రబాబా, కాదా? ఈ రాష్ట్రప్రజలు చూశారా, చూడలేదా?

వైయస్‌ జగన్‌ ఎవరికి కండువా కప్పలేదు. నేను చంద్రబాబు విధానాలతో విభేదిస్తున్నాను. వైయస్‌ జగన్‌ విధానాలకు మధ్దతు పలుకుతున్నాను అని వంశీ ప్రకటించారు. దేవినేని అవినాష్‌ నాపై పోటీ చేశాడు. నేను చెప్పాను.. నీవు చిన్నపిల్లవాడివి చంద్రబాబు పెద్ద లు...గాడు... చాలా దగ్గర్నుంచి చూశాను. తండ్రిలేడు నీకు మోసం, మాయ చేస్తున్నాడు, నీవు నమ్మకు అని చెప్పాను.

అయినా గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు గుడ్డిగా వచ్చి మోసపోయిన వ్యక్తి అవినాష్‌. ఈరోజు అతను వచ్చి పార్టీలో చేరితే జగన్‌, అవినాష్‌ ను ఇంటికి తీసుకువచ్చాడా? మాజీ మంత్రి దేవినేని ఉమ అంటాడు. సన్నాసి సన్నబియ్యం ఇస్తానని చెప్పానంటాడు. ఎవరిదగ్గర చెప్పాను నీ అమ్మ మొగుడు దగ్గర చెప్పానా సన్నబియ్యం ఇస్తానని. నాణ్యమైన బియ్యం ఇస్తాను అని అసెంబ్లీలో ప్రకటించాం. నాణ్యమైన బియ్యం ఇవ్వాలంటే ధాన్యం కొనాలి.

మే 30 తేదీన అధికారంలోకి వచ్చాం..ఈనెల 20 వతేదీనుంచి ధాన్యం అందుబాటులోకి వస్తుంది.మేం వాటిని తీసుకుని వాటిలో క్వాలిటిగా ఉన్నవాటిని తీసుకుని బ్యాగుల ద్వారా ఏప్రిల్‌ నుంచి ప్రజలకు అందిస్తామని జగన్‌ మేం చెప్పాం.

శాంపిల్‌ గా ఈ యధవలు చంద్రబాబు, ఉమ, ఈ బొ... బోషాణాం గాళ్లు రీసైక్లింగ్‌ లో కొన్న బియ్యం మా వద్ద స్టాక్‌ ఉంది. అవి తింటానికి పనికిరావు. వాటిలో మంచి బియ్యాన్ని ఏరితే ఒక జిల్లాకు సరిపోతుంటే వాటిని శ్రీకాకుళం జిల్లాకు ఇస్తున్నాం. ఇలాంటి పరిస్దితి ఉంది.

నేనేమన్నా బియ్యం తయారుచేస్తానా? నీవు కొన్న చెత్తాచెదారేమేగా చెత్త. వీడికి సన్నబియ్యం ఇస్తానని చెప్పానంట. ఐదునెలలుగా ఏం చేస్తున్నారు అంటున్నాడు. మీ నాయకుడు చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు ఏం చేశాడు గుడ్డిగుర్రానికి పళ్లు తోమాడా?

లుచ్చా మాటలు మాట్లాడతావు లు...? దేవినేని ఉమ గురించి మాట్లాడాలంటే వాళ్ళ అన్న చనిపోయాక రాజకీయాల్లోకి వచ్చాడు. డైరక్ట్‌‌గా వచ్చాడా అంటే వదిన అడ్డం పడుతుందని చెప్పి వదినను కూడా చంపావు. అన్న చనిపోతే వదినను చంపి రాజకీయాల్లోకి వచ్చిన నీ లాంటి లు...గాళ్లకు, నీ నాయకుడుకి ఇందిరాగాంధి రెండుసార్లు సీటిచ్చింది, మంత్రిని చేసింది.

మంత్రినైతే ఎన్టీఆర్‌ పిల్లనిచ్చాడు. పార్టీ పెట్టగానే ఆయన వద్దకు వచ్చావా? రంగులేసుకునేవాడు రాజకీయాలకు పనికిరాడు. కాంగ్రెస్‌ లోనే ఉండి అమ్మ ఆదేశిస్తే ఎన్టీఆర్‌ పైనే పోటీ చేస్తానంటూ ప్రగల్భాలు పలికి ఎన్టీఆర్‌ చేతిలో ఓడిపోయి మూడురోజులలో వెళ్లి తెలుగుదేశం పార్టీలో చేరావు.

అప్పుడు పోరాటం తెలియదా? అప్పుడు తల్లిలాంటి పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అనిపించలేదా? నీకు రెండుసార్లు టిక్కెట్లు ఇచ్చి మంత్రిని చేస్తే నీవు ఎందుకు వదిలివెళ్లావు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ రెండుసార్లు ఎంఎల్‌‌ఏ సీటు ఇచ్చాడు. నీకోసం కర్షక పరిషత్‌ పెట్టాడు. మంత్రి పదవి ఇచ్చాడు. ఎన్టీఆర్‌ సరిగా పరిపాలించడం లేదని చెప్పి ఆయనకు వెన్నుపోటు పొడిచి మెడపెట్టి సస్పెండ్‌ చేసి పార్టీలోనుంచి బయటకు నెట్టి పార్టీని, ముఖ్యమంత్రి పదవిని లాక్కుని ఆయన చావుకు కారణమైన సన్నాసి, వెధవ, లు... చంద్రబాబునాయుడు.

మామను చంపిన లు... చంద్రబాబు, వదినను చంపిన లు...వి నీవు. మీ ఇద్దరు లు... కలసి నన్ను అడుగుతారా? ఐదునెలల్లో సన్నబియ్యం ఇస్తానని చెప్పానా? నీ అమ్మ మొగుడికి చెప్పానా? వళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు మాట్లాడేటప్పుడు. 

అదే విధంగా అవినాష్‌ గురించి చెప్పాలి. మేమేదో పట్టుకొచ్చామని చెబుతున్నాడు. దేవినేని నెహ్రూ అనే వ్యక్తి ఎన్టీఆర్‌‌తో కలసి రాజకీయాలలోకి వచ్చాడు. ఆయన ,రామారావుగారు బతికి ఉన్నంతకాలం ఆయన పరిస్దితి బాగోకపోయినా ఆయనను వదిలివేసి రాలేనని చెప్పి ఎన్టీఆర్‌ ఆఖరి శ్వాసవరకు అక్కడే ఉన్నాడు.

ఆ సమయంలో చంద్రబాబును ఎవ్వరూ తిట్టనంతవిధంగా ఎన్టీఆర్‌‌కు ద్రోహం చేశాడు, ద్రోహీ అని భయంకరంగా తిట్టిన వ్యక్తి దేవినేని నెహ్రూ. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లారు. కాంగ్రెస్‌ పార్టీ తుడిచిపెట్టుకుపోయాక ఇబ్బందులు పడుతున్న టైంలో కుమారుడు భవిష్యత్తు కోసం నాలుగుమెట్లు కిందకు దిగి దుర్మార్గుడు, దుష్టుడు అయిన చంద్రబాబు వద్దకు వెళ్లి చేతులు పట్టుకుని నా కుమారుడును నీ చేతుల్లో పెడుతున్నాను జరిగింది మనస్సులో పెట్టుకోమాకు, అతనికి రాజకీయంగా లిఫ్ట్‌ ఇమ్మని అడిగి పార్టీలో చేరిన సంవత్సరంలోనే మరణించారు నెహ్రూ.

నెహ్రూకి ఆరోగ్యం బాగుంటే చంద్రబాబు లాంటి వారితో జీవితకాలం పోరాటం చేసేవారు నెహ్రూ. నీవు నమ్మకంగా చేర్చుకుని ఆయన పోయిన తర్వాత తెలుగుయువత అధ్యక్షపదవి ఇచ్చాడంట. అదోక పెద్ద పదవి. కళావెంకట్రావు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు. ఆయనను చూస్తే ఏమనిపిస్తుంది.

అలాంటి పార్టీకి గుడివాడలో టిక్కెట్టు ఇచ్చి,దొంగసర్వేకాగితాలు ఇచ్చి గుడివాడ పంపారు. ఓడిపోయివచ్చాక అతనిని ఓ పురుగులా చూశారు. పైన ఉన్న ఎన్టీఆర్,దేవినేని నెహ్రూ జ్ఞానోదయం కల్పిస్తే వచ్చాడు జగన్‌ దగ్గరకు. జగన్‌, అవినాష్‌ ఇంటికి వెళ్లి పార్టీలోకి తీసుకువచ్చాడా?

జగన్‌ గురించి మాట్లాడుతున్నారు వీళ్లు. ఏరకంగా బ్లాక్‌ మెయిల్‌ చేశారు. ఎంత ఇబ్బంది పెట్టారో చెప్పాడు అవినాష్‌. నన్ను నమ్ముకున్న ప్రజలకోసం ఈ పార్టీలోనే ఉంటే ఈ పప్పుగాడు పార్టీని ముంచేస్తాడు. కాబట్టి దీంట్లో ఉంటే ఈ పడవను ధర్మాడి సత్యంగారు కూడా కాపాడలేడని చెప్పి బెల్టులు కట్టుకుని ఆయన దూకేశాడు.దానికి జగన్‌ గారిని తిడతారు.

జగన్‌ మీలాగా విలువల్లేని వ్యక్తి కాదు. తప్పకుండా టిడిపి కి రాజీనామా చేశాకనే పార్టీలోకి చేర్చుకుంటానని చెప్పారు. ఆ మాటకే ఆయన కట్టుబడి ఉన్నారు. టిడిపి నేతలు నలుగురు ఉదయం ప్రెస్‌ మీట్‌ పెట్టి అవినాష్‌ ను చేర్చుకున్నారని, వంశీని చేర్చుకోలేదు.

అయినా జగన్‌‌ని తిట్టారు. టిడిపి ఎంపీలు సుజనాచౌదరి, సిఎంరమేష్, గరకిపాటి మోహన్‌ రావు,టిజేవెంకటేష్‌ లు బిజేపిలో చేరితే ఈ సన్నాసులకు కళ్లు కనపడలేదా? ఒక్కడు మాట్లాడాడా? కేసులు పెట్టి కేంద్రం లోపలేస్తుంది. భయపడి ఉచ్చపోసుకుని మాకేం సంబంధం లేనట్లు ఇళ్ళల్లో దాక్కున్నారు.

అలాంటి వాళ్లు చూసుకుందాం రా అంటావా? ఏం... ఉమా చూసుకునేది. ఎక్కడకు రమ్మంటావు?పిచ్చవాగుళ్లు, పిచ్చిమాటలు మాట్లాడమాకు. ఇంకా కొన్ని ఆరోపణలు ఇసుక కొరత కృత్రిమంగా జగన్‌ సృష్టించారంట.

నదులలో వరద ఉంటే ఇసుక ఎవడైనా తీస్తారా? ఇసుక తీసుకురాకపోవడంవల్ల సిమెంట్‌ రేట్లు పెరిగాయంట. ఇసుక లేకపోతే సిమెంట్‌ ఎవరూ వాడరు.

అదే విధంగా చంద్రబాబు, ఆయన పార్టనర్‌  పవన్‌ కల్యాణ్‌ మతాల గురించి కులాల గురించి మాట్లాడతారు. పవన్‌ కల్యాణ్‌ చాలా గొప్పగా చెబుతుంటారు. పుస్తకాలు చదివా అవి చదివా ఇవి చదివా అని చెబుతుంటాడు. విధానాలు అంటాడు. ఆ విధనాలేవో నాకు అర్దం కాదు. కులాల గురించి మతాల గురించి మాట్లాడనని చెప్పి ఎక్కువ వాటిగురించే మాట్లాడే వ్యక్తి పవన్‌ కల్యాణ్‌.
 
 వైయస్‌ జగన్‌ తిరుపతి ప్రసాదం తింటాడా తినడా నాకు తెలియదు అంటాడు. నీవు ఈసారి జగన్‌  తిరుపతి వెళ్లినప్పుడు నీవు వెళ్లు తింటాడో తినడో తెలుస్తుంది. పాదయాత్ర ప్రారంభం అప్పుడు తొలిగా తిరుపతి వెళ్లి అక్కడనుంచి ఇడుపులపాయ వెళ్లి ప్రారంభించారు.

ఇచ్చాపురంలో పాదయాత్ర ముగిసిన తర్వాత అక్కడ్నుంచి తిరుపతి అలిపిరి వరకు వెళ్లి కాలినడకన వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మసీదుకు, చర్చికి వెళ్లారు.  అసలు జగన్‌ మోహన్‌ రెడ్డి కులం ఏంటో మతం ఏంటో చెప్పాల్సిన అవసరం ఆయనకు ఏంటి? పార్టీ పెట్టి రెండుచోట్ల పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయిన వ్యక్తి నేత వచ్చి అడిగితే జగన్‌ చెబుతారా?

చంద్రబాబు చెబుతారు, సోనియాగాంధినే తిరుపతిలో సంతకం పెట్టి వెళ్లింది. జగన్‌ మోహన్‌ రెడ్డి ఎందుకు పెట్టడు అని అంటాడు. జగన్‌ ఆంధ్ర పౌరుడు ఇక్కడ పుట్టిన వ్యక్తి. సోనియాగాంధి ఇటలీ నుంచి వచ్చింది. కాబట్టి ఆమె పెడితే పెట్టుకుంటుందేమో.

సోనియా గాంధి అంటే నీకు భయమేమో, చిదంబరం కాళ్లు... ఆవిడ బూట్లు.... సోనియాగాంధి అంటే జగన్‌ కి ఏమైనా భయమా? తిరుపతివెళ్తే సంతకం పెట్టాలి. రాజారెడ్డి గురించి మాట్లాడతారు, రాజారెడ్డి దోపిడీలు చేశారు, దొంగతనాలు చేశారు అని అంటాడు.. నీ అయ్య ఖర్జూరనాయుడు ఏంచేశాడు... తిరుపతి బస్టాండ్‌ లో జేబులు కట్‌ చేశాడా? రాజారెడ్డి, వైయస్‌ రాజశేఖరరెడ్డి గురించి, జగన్‌ కుటుంబం గురించి పిచ్చిపిచ్చిమాటలు మాట్లాడితే నీ బాబు బస్టాండ్‌ లో జేబులు కొట్టిన కాడ్నించి ఆయన బాబు ఏం చేశాడు అవి కూడ తీసి జనం ముందు పెట్టాల్సిన పరిస్దితి ఉంటుంది. 

నీ పార్టీలో ఉన్న సంక్షోభం నీ కుమారుడు పప్పు వల్ల వచ్చింది. రోడ్డురోలర్‌ లాగా టిడిపిని తొక్కేస్తాడు దాంట్లో నలిగి పోతామని చెప్పి ఎటు వాళ్లు అటు దూకేద్దామని చెప్పి వాళ్లు ప్రయత్నం చేస్తుంటే నీ పార్టీని, ఎంఎల్‌ ఏలను నీవు కాపాడుకోలేక నీ... చూడలేక వాళ్ళు నీవు పిలిచినా రాలేదు. 23 మంది ఎంఎల్‌ ఏలు ఉంటే 9 మంది వచ్చారు. వాళ్లే రాలేదు అది సూపర్‌ సక్సెస్‌ అని చెబుతావు.
 
12 గంటల దీక్ష అంటే ఉదయం టిఫిన్‌ చేసి  వచ్చి కూర్చుంటాడు. రాత్రి 8 గంటలకు భోజనం చేస్తాడు. మధ్యాహ్నం ఫ్రూట్స్‌ తింటాడు. ఇంక దీక్ష ఏంటి? ఎవడన్నా నవ్వుకుంటాడని కూడా లేదు. ఇసుక బస్తాలు మెడలో వేశారు. ఎందుకంటే ఇసుక సమస్య తెలియడానికి అంట.

మాంసం తిన్నవాడు బొనికలు మెడలో వేసుకుంటాడు అన్నట్లు ఉంది చంద్రబాబు పరిస్దితి. ఐదేళ్లు ఇసుక తిన్న బకాసురుడు చంద్రబాబు అందుకే ఇసుక బస్తాలు వేసుకున్నాడు. సిగ్గు,శరం లేదు ఎవరైనా ఇసుక మెడలో వేసుకుని కూర్చుంటాడా? జగన్‌ పై మాట్లాడటానికి ఏం లేదు. ఆరోపణలు చేయడానికి కూడా ఏం లేవు.

అందుకే ఇంగ్లీషు, హిందీ, తెలుగు..... క్రిష్టియన్, ముస్లిం, హిందూ  వెంకటేశ్వరస్వామి అని ఆరోపణలు చేస్తున్నారు. అదేమంటే నీ కులం ఏంటి? నీ మతం ఏంటి?  ఇంకోకాయని చెబుతున్నారు. 151 మందిమి మీటింగ్‌ పెట్టుకుని జగన్‌ ని ఏమని పిలవాలో ఈయనకు చెప్పాలంట.

జగన్‌ రెడ్డి అని పిలవాలా జగన్‌ అని పిలవాలా? జగన్‌ మోహన్‌ రెడ్డి అని పిలవాలా అని అంటాడు. నీవు కూడా డిపాజిట్‌ లు పోయిన వారందరిని పిలిచి మీటింగ్‌ పెట్టుకో. ఎందుకంటే మీ తండ్రి కల్యాణ్‌ బాబు అని పెడితే మీ అన్నయ్య దానిని పవన్‌ కల్యాణ్‌ గా మార్చారు.

అభిమానులు ఏమో పవర్‌ స్టార్‌ అనిపిలుస్తారు. నీయాక్టింగ్, డ్రామా చూసి మా పార్టీ వాళ్లు పవన్‌ నాయుడు అని పెట్టారు. నీ దురభిమానులు ప్యాకేజి స్టార్‌ అని పెట్టారు. నీవు వీటిలో ఏ పేరో చెబితే మేం కూడా ఆ పేరుతో పిలుస్తాం.

చంద్రబాబూ! నీ టైమ్‌ అయిపోయింది. ఇక జన్మలో ముఖ్యమంత్రివి గాని ప్రతిపక్షనేతవి గాని అవలేవు. నీవు చేసిన డ్రామాలు చాలు. వంశీ నాలుగుమాటలు మాట్లాడగానే నలుగురు పిచ్చికుక్కలతో మాట్లాడించావు. ఇవన్నీ ఎప్పుడు చూడలేదు. నీవు ఎన్టీఆర్‌ కు, ఇందిరాగాంధికి వెన్నుపోటు పొడవచ్చు.

నీవు పార్టీలు మారచ్చు. నీవు రెండుసార్లు టిక్కెట్లు ఇస్తే పార్టీ మారకూడదు. నీ కాళ్ల దగ్గర కూర్చోవాలా? నీవు ఫ్లాట్‌ ఫారం గాడివి. నీకు టిక్కెట్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు మారావు?నిన్ను అక్కున చేర్చుకున్న ఎన్టీఆర్‌ కు ఎందుకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నావు వీటికి సమాధానం చెప్పు.
 
నీ ఊరకుక్కలని అడుగుతున్నా వీటికి సమాధానం చెప్పమని చంద్రబాబును అడగండి. మా దగ్గర్నుంచి తీసుకున్న 23 మంది ఎంఎల్‌ ఏలతో తిట్టించి ఆనందించావు. నీ శునకానందం ఏంటి? మీ పార్టీలో ఉన్న సంక్షోభం గురించి మాట్లాడుకోండి.

జగన్‌ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. జగన్‌ కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాడు కాబట్టి నీవింకా ప్రతిపక్షనేతగా ఉన్నావు. అదే జగన్‌ కనుక చిటికె వేస్తే నీకు ప్రతిపక్ష హోదా కాదు. నీ తెలుగుదేశం పార్టీ తీసుకువచ్చి కింద మా పార్టీ గదిలో పెట్టిస్తాం.

నీ టిడిపి అధ్యక్షుడ్ని కూడా మార్చి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కింద ఉన్న స్టోర్‌ రూమ్‌ లో పెట్టిస్తాం. జగన్‌ ఆదేశిస్తే నీ ప్రతిపక్ష హోదా తీసి జగన్‌ వెనకాల అన్నా అన్నా అని తిరిగేలా చేస్తాం. పిచ్చిపిచ్చి మాటలు కట్టిపెట్టి మీ పార్టీలో సంక్షోభాన్ని పరిష్కరించుకుంటారో, తిట్టుకుంటారో, కొట్టుకుంటారో ఏదో ఒకటి చావండి.

మా పార్టీ జోలికి వస్తే ఊరుకోం. దేవినేని ఉమ చెబుతాడు. నాలుగు బ్రాండ్లే అమ్ముతున్నారంట. జగన్‌ కి ఇష్టమైన బ్రాండ్‌ లే అమ్ముతున్నారంట. లోకేష్, చంద్రబాబు తాగే బ్రాండ్‌ లు అమ్మడం లేదంట. జగన్‌ స్పష్టంగా చెప్పారు. ఎన్నికల ముందు దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తామని చెప్పారు. అదే ఇప్పుడు చేస్తున్నాడు.

ఇంగ్లీషు మీడియం తీసుకువచ్చి బడుగుబలహీన వర్గాల వారిని ఉన్నతస్దానాల్లోకి తీసుకువస్తాం అని చెప్పారు. చంద్రబాబు పిల్లలు, మా పిల్లలు, మీ అందరి పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ పిల్లలు ఏం మీడియంలో చదువుతున్నారు?

పేద పిల్లలు మాత్రం ఇంగ్లీషులో చదువుకోకూడదంట. తెలుగులో చదువుకోవాలంట. ఇదంతా చూసి జనం గడ్డిపెడితే నోరుమూసుకుని కూర్చున్నారు. చంద్రబాబూ! నీకు దమ్ముంటే ఇసుకపై పోరాటం చేస్తానంటున్నావు. ఇంగ్లీషుపై, ఇసుకపై ప్రెస్‌ మీట్‌ లు పెట్టి మాట్లాడు ఇంటికి వచ్చి జనం తంతారు.

కాబట్టి ఏదిలేక  ఇసుకో, బుసకో, మట్టి మసానమో ఏదో ఒకటి, తొక్కో తోలే నీ పార్టీలో ఉన్న సంక్షోభం అన్నీ జనానికి రుద్ది ఏదో రకంగా బతకాలని ప్రయత్నిస్తున్నావు. 40 ఏళ్లుగా నీ డ్రామాలన్నీ ప్రజలు చూస్తున్నారు. నీవు ఎంత దీనంగా మొహం పెట్టినా ఎవరికి జాలి ఉండదు.

ఎందుకంటే ఎన్టీఆర్‌ ను చాలా నిర్ధాక్షణ్యంగా చంపావు. అది ఊరకనే పోదు. పైన ఉన్న ఎన్టీఆర్‌, వైయస్‌ రాజశేఖరరెడ్డి, ఐదుకోట్లమంది ప్రజల ఆశీస్సులు వైయస్‌ జగన్‌ కి పుష్కలంగా ఉన్నాయి.
 
జగన్‌ ని నీవు గాని నీ పార్టీ శ్రేణులు, నీ కుమారుడు పప్పుగాని ఏమీ చేయలేరు. నీ పార్టీ ఎంపీలు బిజేపిలో చేరారు. అక్కడ కు వెళ్లి ధర్నా చేయి. లోపల వేస్తారు. నీ డ్రామాలు, నాటకాలు అన్నీ తెలుసు,జగన్‌  ఎటువంటి అవినీతి పనులు చేయడం లేదు.

ఉమ,యనమల రామకృష్ణుడులు బ్రోకర్లు చంద్రబాబుకు. మంచి శాఖలు ఎక్కువ డబ్బులు వచ్చేవి మీరు చేశారు. కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు దోచి వాటిని పెదబాబుకు, చినబాబుకు అందించారు. చంద్రబాబు ఇలాంటి బ్రోకర్లతో వళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడించు. నీవు కూడా జాగ్రత్తగా మాట్లాడు.

 నీవు అంత పోటుగాడివి అయితే తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులకు ఇచ్చేసి జగన్‌ కాంగ్రెస్‌ నుంచి వచ్చి పెట్టినట్లు వైయస్సార్‌ కాంగ్రెస్‌ లా సిబిఎన్‌ అని పార్టీ పెట్టు. ఆ పార్టీకి డిపాజిట్‌ వస్తే ఈ రాష్ట్రం వదలి నేను వెళ్లిపోతా. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన సొంతనియోజకవర్గం చంద్రగిరిలో టిడిపిని గెలిపించుకోలేకపోయాడు.

అలాంటి వ్యక్తిని పార్టీ అధ్యక్షుడుగా ఎలా పెట్టుకున్నారు. 1999,2004,2009, 2014, 2019లో చిత్తూరు జిల్లాలో మెజారిటి సీట్లు ఎప్పుడన్నా గెలిపించావా? వైయస్‌ రాజశేఖరరెడ్డి 1978 లో రాజకీయాల్లో వచ్చినప్పట్నుంచి వారి కుటుంబసభ్యులే గెలుస్తున్నారు. రాష్ట్రంలో టిడిపి అదికారంలో ఉన్నా కడపలో మాత్రం కాంగ్రెస్‌ వాళ్లే గెలిచేవాళ్లు. ఇది నాయకత్వం అంటే.
 
జే టాక్స్‌ అనిఅంటున్నారు. నేను ఎక్కడా జే టాక్స్‌ కట్టలేదు మీరు గాని మీ స్నేహితులు గాని ఎక్కడన్నా కట్టారా?చంద్రబాబు మాటలు ఎక్కడా నమ్మకండి. పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ వెళ్తే అందులో విశేషం ఏముంది. యనమల రామకృష్ణుడు ఎన్టీఆర్‌ కు ద్రోహం చేసిన వారిలో ప్రముఖుడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు