హైకోర్టు వద్ద తాగడానికి టీ కూడా లేని పరిస్థితా? సీఎం జగన్ కి బాబు ప్రశ్న

గురువారం, 24 అక్టోబరు 2019 (21:15 IST)
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధాని అమరావతి గురించి చేసిన వ్యాఖ్యలపై తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఆయన ఏమన్నారో చూడండి.
 
''రాష్ట్రం నడిబొడ్డున, నది ఒడ్డున అందరికీ అందుబాటులో ఉండాలని అమరావతిని రాజధానిగా నిర్ణయించాం. ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆరోజు స్వాగతించారు. శివరామకృష్ణన్ కమిటీ చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో, కమిటీకి వచ్చిన మెయిల్స్ కూడా అమరావతినే అనుకూల ప్రాంతంగా ధ్రువీకరించాయి.
 
ప్రధాని శంకుస్థాపన చేసిన 4 ఏళ్ల తరువాత ఇప్పుడు మళ్లీ రాజధాని నిర్ణయంపై కమిటీ వేయడం ఏమిటి?. ‘‘హైకోర్టు వద్ద తాగడానికి టీ కూడా లేని పరిస్థితి’’ అనే వ్యాఖ్యలు మీకు తలవంపులుగా లేవా? వైసీపీ ప్రభుత్వానికి రాజధాని నిర్మించే సత్తా లేదు. ఆ విషయాన్ని ప్రజల ముందు ఒప్పుకునే నిజాయితీ లేదు.'' అని ట్వీట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు