ఇలాంటి సందర్భంలో జనసేన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విధానాలపై చర్చించారు. ముఖ్యంగా రాజధాని విషయంలోను, ఇసుక కొరతపై చర్చించుకున్నారు. కృత్రిమ ఇసుక కొరతతో ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు జీవనోపాధి లేకుండా చేసిందని పవన్ కళ్యాణ్ అన్నారు. అంతేకాకుండా రాజధాని విషయంలో బొత్స సత్యనారాయణ గందరగోళమైన ప్రకటనలు చేస్తూ ప్రజలను మరింత గందరగోళానికి గురిచేస్తున్నారంటూ గతంలో పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
సిఎం జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్‌ల మధ్య పది నిమిషాల పాటు ఫోన్లో సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకే తాము ఉన్నామని.. స్నేహితుడిగా తాను కొన్ని విషయాలకు మాత్రమే ఏకీభవిస్తానని... అన్నింటికీ నేను ఒప్పుకోనని ఖరాఖండిగా చెప్పేశారట పవన్. సరదాగానే పవన్ కళ్యాన్ సిఎంతో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని జనసేన వర్గాలు అత్యంత గోప్యంగా ఉంచుతున్నాయి.