నదుల అనుసంధానం రాష్ట్రంలోనూ జరగాలి: చంద్రబాబు

శనివారం, 22 నవంబరు 2014 (17:55 IST)
నదుల అనుసంధానం తప్పనిసరి అని న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన ‘జల మంథన్’ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అలాగే రాష్ట్రంలోని నదులను అనుసంధానించడం తప్పనిసరిగా చేయాలని చంద్రబాబు కోరారు. 
 
''జల మంథన్'' సదస్సులో బాబు మాట్లాడుతూ నదుల అనుసంధానం అంశం మీద ఎప్పటినుంచో చర్చ జరుగుతున్నాయన్నారు. నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు నదుల అనుసంధానం తప్పనిసరి అన్నారు. 
 
కొన్ని దేశాలలో అయితే ఏకంగా సముద్రపు నీటినే మంచినీరుగా మార్చుకుంటున్నాయని తెలిపారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో 34 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఇలాంటి పరిస్థితిలో నీటి నిర్వహణ మరింత జాగ్రత్తగా వుండాలి. 

వెబ్దునియా పై చదవండి