దీంతో పర్యటన చివరి నిమిషంలో పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నేరుగా అక్రమ క్వారీల వైపు కారును పోనివ్వమన్నారు. మూడుకిలోమీటర్లు అక్రమ క్వారీల్లోనే నడిచారు. గంటన్నరకుపైగా ఆ ప్రాంతంలోనే ఉన్నారు. అక్రమార్కుల బండారం బయటపెట్టాలనుకున్నారు. వెంటనే ఈ నిర్ణయం తీసేసుకున్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో అక్రమ క్వారీలకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉందంటూ చంద్రబాబు ఆరోపించారు.