టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరో ధనుష్‌ల మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీవీ సీరియల్ నటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన మృణాల్ ప్రస్తుతం టాప్ హీరోయిన్‌గా పేరుకొట్టేసింది. సీతారామం, హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్, జెర్సీ, కల్కి 2898, లవ్ సోనియా, ఆంఖ్ మిచోలి, లస్ట్ స్టోరీస్ 2, పిప్పా, గుమ్రా వంటి అనేక చిత్రాల విజయం ఆమెకు కొత్త గుర్తింపును ఇచ్చింది.