శేషాచలం అటవీ ప్రాంతం అంటేనే ఎన్నో క్రూరమృగాలు ఉంటాయి. ముఖ్యంగా చిరుతలు, ఏనుగులు, మిగిలిన జంతువులన్నీ ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. అయితే జనసంచారం పెద్దగా తిరుమలలో లేకపోవడంతో జంతువులన్నీ రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. తాజాగా ఓ చిరుత తిరుపతిలోని రెండవ ఘాట్ రోడ్డులో ప్రత్యక్షమైంది.
చిరుతను అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వాహనాలను మాత్రం యధావిధిగా ఘాట్ రోడ్డులో పంపించేస్తున్నారు. ఐదు, ఆరు వాహనాలను ఒకేసారి తిరుమలకు అనుమతిస్తున్నారు. మరోసారి చిరుత సంచారం శేషాచలం అటవీ ప్రాంతంలో ఉండడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.