రంజాన్ మాసం శుభాల వసంతమని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రంజాన్ ఒక మహత్తర మాసమని, ఈ పేరు వినగానే మనస్సు భక్తితో, ఆనందంతో పులకరిస్తుందన్నారు. ఈ మాసంలోనే పవిత్ర ఖురాన్ గ్రంధం అవతరించిందని, రోజా (ఉపవాస వ్రతం) ఆరాధనను దైవం ఈ మాసంలోనే నిర్ణయించినందున ఈ మాసానికి పవిత్రత, గొప్పదనం వచ్చాయన్నారు.
నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో కఠోర ఉపవాసాలు చేయడం మహా పుణ్య కార్యమన్నారు. ఈ మాసం వాతావరణమంతా పుణ్యకారం, దైవభీతి అనే సుగుణాలతో నిండాలని, ఈ పవిత్ర రంజాన్ మాసం మానవాళికి శాంతి సందేశం అందించాలని, అందరి ఇంట సుఖశాంతులు నిండాలని, రంజాన్ శోభతో నియోజకవర్గం విరాజిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
కరోనా మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల సందర్భంగా ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, సచివాలయ ముస్లిం ఉద్యోగులు తమ విధులనుంచి గంట ముందుగా ఇంటికి వెళ్లేందుకు జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఉపవాస దీక్షలుకు, ప్రత్యేక ప్రార్థనలుకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా విద్యుత్, మున్సిపాలిటీ శాఖలు ప్రత్యేక చొరవ చూపాలని ఆయన ఆదేశించారు. ఈసందర్బంగా ముస్లిం సోదరులుకు శ్రీకాంత్ రెడ్డి రంజాన్ మాసపు ప్రారంభపు శుభాకాంక్షలు తెలిపారు.