రాయదుర్గంలో దారుణం.. నీటి సంపులో పడి బాలుడి మృతి

గురువారం, 29 జూన్ 2023 (23:02 IST)
రాయదుర్గంలో దారుణం చోటుచేసుకుంది. మృతి రాయదుర్గం పట్టణం చంద్రబాబు కాలనీకి చెందిన జస్వంత్ అను మూడేళ్ల బాలుడు నీటి సంపులో పడి మృతి చెందిన ఘటన గురువారం రాయదుర్గంలో చోటుచేసుకుంది. 
 
కాలనీకి చెందిన టైలర్ పని చేసుకుని జీవించే మంజునాథ్ సరిత కుమారుడు జస్వంత్ బుధవారం సాయంత్రం నుండి కనిపించకుండా పోయాడు. దీంతో అతడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 
 
గురువారం ఉదయం కాలనీలోని నిర్మాణంలో ఉన్న ఒక ఇంటి యజమాని గోడలకు క్యూరింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు సంపులో చిన్నారి శవం కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు