చిత్తూరు జిల్లా కుర్రోడు ఐఏఎస్ అయ్యాడు..!

శనివారం, 3 ఆగస్టు 2019 (13:35 IST)
ఓ మధ్యతరగతి దళిత కుటుంబంలో జన్మిచిన ఉదయ్ ప్రవీణ్ కష్టాలలో చదువుతూ కన్నీళ్ళు మింగుతూ, పంటి బిగువున బాధలను భరిస్తూ చదవులు కొనసాగించాడు. తనను ఐఏఎస్ అవుతాడట అంటూ హేళన చేసినవారికి... నేను అవుతాను అనే పట్టుదలతో చెప్పిన మాటలు ఇపుడు నిజం చేశాను అని ఉదయ్ ప్రవీణ్ చెప్పుకొచ్చాడు.
 
ఈ కుర్రోడికి తాజాగా సన్మాన సభ జరిగింది. ఈ సందర్భంగా ఆ యువకుడు ఓ విలేకరితో మాట్లాడుతూ, "బ్రదర్ 
తల్లితండ్రులు ప్రేరణతోనే నేను ఐఏఎస్ అయ్యాను. వారి కృషి, ఈ సమాజం నాకు చేయూతని అందించిది. ఇది నా గొప్పకాదు. ఈ సమాజం గొప్ప. నన్ను ఈ స్థాయికి తెచ్చిన అందరికి జన్మజన్మల రుణపడి ఉంటా. అందులో నేను పుట్టిన ఈ పళ్ళమాల గ్రామం రుణం తీర్చుకుంటా అంటూ భావోద్వేగంతో కళ్ళు చెమర్చాడు. నా ఈ జీవితం ప్రజాసేవకే అంకితమని నా ఊపిరి ఉన్నంత వరకు ప్రజా శ్రేయస్సు కోసమేనని చెప్పాడు.
 
ఈ యువ ఐఏఎస్ ఓ రోజు హౌస్‌సర్జన్‌గా ఉన్నపుడు ఓ పాఠశాలలో మధ్యాహ్నం భోజనాలు చేస్తున్నపుడు అందులో నాణ్యత లేని భోజనాలు తిని, పిల్లలు అస్వస్థతకు లోనైనా సంఘటన తనపై తీవ్రప్రభావాన్ని చూపాయని కనీసం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సైతం భోజనాలు సక్రమంగా పంపిణీ కానీ వైనం తనను తన మనసును ఎంతగానో కలచి వేసేయాని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. 
 
తాను ఐఏఎస్ అయ్యి విద్యార్థులకు మంచి భోజనం నాణ్యమైన విద్య, వైద్యం, కనీస మౌళిక వసతులనైనా కల్పించాలన్న సదుద్దేశంతో ఐఏఎస్ కావాలన్న పట్టుదలతో అయ్యానని చెప్పారు. శుక్రవారం పళ్ళమాల గ్రామంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన అభినందన సభకు హాజరైన సందర్భంలో ఇలా వ్యాఖ్యానించారు. ఈ యువ ఐఏఎస్ నేటి సమాజంలో విద్యార్థులకు మర్గదర్శకం కావాలని, ఈ యువ ఐఏఎస్ "ఉదయ్ ప్రవీణ్" ఉన్నత శిఖరాలకు ఎదగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు