37 ఏళ్లు.. 37 పాముకాట్లు.. సంపాదించే డబ్బంతా చికిత్సకే స్వాహా!!

మంగళవారం, 1 డిశెంబరు 2020 (22:25 IST)
పాములంటేనే ఆమడదూరం పరుగులు తీసేవారు చాలామంది వుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం 37 ఏళ్లుగా పాములు వెంటాడుతున్నా.. మృత్యుంజయుడిగా మారాడు. ఆ వ్యక్తిని 37 ఏళ్లుగా పాములు కాటేస్తున్నాయి. ప్రతి ఏటా క్రమం తప్పకుండా కాటు వేస్తున్నాయి. ఇప్పటివరకు అతడు 37 సార్లు పాము కాటుకు గురయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం పెద్దచల్లారగుంట పంచాయతీ కురవూరు గ్రామానికి చెందిన సుబ్రమణ్యం (42) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సుబ్రమణ్యం ఐదో తరగతి చదువుతున్న సమయంలో మొదటిసారి పాము కాటు వేసింది. ఈ తర్వాత ప్రతి ఏటా ఎప్పుడో ఓసారి పాములు కాటేస్తూనే ఉన్నాయి.
 
అలా 37 ఏళ్లలో 37 సార్లు సుబ్రమణ్యం పాము కాటుకు గురయ్యాడు. అది కూడా అతడి కుడి చేయి, కుడి కాలుపై మాత్రమే నాగుపాములు కాటేస్తున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. పాము కాటువేస్తే కనీసం 10 రోజులు విశ్రాంతి అవసరం. అంతేకాదు వైద్య చికిత్స కోసం రూ.10 వేల వరకు ఖర్చవుతోందని సుబ్రమణ్యం తెలిపారు.
 
కూలీనాలీ చేసుకుని జీవనం సాగించంకునే తనకు ఇంత డబ్బు ఖర్చుచేయడం.. భారమవుతోందని వాపోతున్నారు. కాగా, ఇటీవలే మరోసారి అతడిని పాము కాటువేసింది. చికిత్స అనంతరం ప్రస్తుతం ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నాడు. తాము సంపాదించిన డబ్బుంతా పాముకాటు చికిత్సకే ఖర్చవుతుందోని తమను ప్రభుత్వం ఆందుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు