జాక్వెలిన్ ఫెర్నాండేజ్ యాక్టింగ్, యాక్షన్, డ్యాన్స్‌లతో అందరినీ అలరిస్తూ ఉంటారు. జాక్వెలిన్ చేసిన రేస్, రైడ్, వెల్కమ్, హౌస్‌ఫుల్, ఫతే వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్‌లుగా నిలిచాయి. ఇక జాక్వెలిన్ త్వరలో వి. జయశంకర్ దర్శకత్వం వహించే మహిళా ప్రధాన చిత్రంలో నటించవచ్చని తెలుస్తోంది. దర్శకుడు జయ శంకర్ గతంలో పేపర్ బాయ్, అరి వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు.