యువకుడు కామాంధుడుగా మారాడు. తన చేతిలో వున్న వీడియోతో పక్కింట్లో స్నానం చేస్తున్న మహిళను వీడియో తీశాడు. ఈ కారణంగా తన సోదరి, తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే... చిత్తూరు జిల్లాలోని వి.కోట మండలం దాసర్లపల్లిలో అనసూయమ్మకు ఓ కొడుకు, కుమార్తె వున్నారు.
కొడుకు తన వద్ద వున్న వీడియో కెమేరాను మరో దానికి ప్రయోగించాడు. అతడిలో కామాంధుడు మేల్కొన్నాడు. పక్కింట్లో స్నానం చేస్తున్న మహిళ స్నాన ఘట్టాన్ని తన వీడియో ద్వారా చిత్రీకరించాడు. విషయం తెలుసుకున్న పక్కింటివారు అతడిని చితకబాదారు. దీనితో అతడి తల్లి, సోదరి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తన కుమారుడు చేసిన పనికి కుమిలిపోయింది తల్లి. దీనితో తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం ఉదయం ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.