తిరుమలలో అన్యమతప్రచారం - మాడా వీధుల్లో శిలువతో తిరిగిన అన్యమతస్తుడు

బుధవారం, 7 సెప్టెంబరు 2016 (10:49 IST)
తిరుమలలో మరోసారి అన్యమతప్రచారం జరిగింది. శ్రీవారి ఆలయ ప్రాకారానికి గుర్తు తెలియని వ్యక్తి శిలువ ఆకారాన్ని గీస్తూ కనిపించాడు. నాలుగు మాడా వీధుల్లో అన్యమతస్తుడు తిరుగుతుండగా భక్తులు గుర్తించి విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే విజిలెన్స్ అధికారులు అన్యమతస్తుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అన్యమతస్తుడు వేలూరులోని సిఎంసి ఆసుపత్రికి చెందిన ఆంబులెన్స్ డ్రైవర్‌గా గుర్తించారు. 
 
తిరుపతి నుంచి తిరుమలకు శిలువ గుర్తును మెడలో వేసుకుని ఎలా వచ్చాడన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సాధారణంగా అలిపిరిలో తనిఖీ చేసి పంపుతారు. అలాంటిది అన్యమతస్తుడు ఏ విధంగా రాగలిగాడో తితిదే విజిలెన్స్ అధికారులు అర్థం కావడం లేదు. తిరుమలలో అన్యమతప్రచారం జరగడంపై హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి