తెలుగుదేశం అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించాలని సీఐడీ అధికారులు కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు గురువారం ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. చంద్రబాబు రిమాండ్ గడువు గురువారంతో (నేడు) ముగియనుండడంతో సీఐడీ అధికారులు మరోసారి రిమాండ్‌ను పొడిగించాలని కోరుతున్నారు.
ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. మరోవైపు, స్కిల్ డెవలప్‌మెంట్ కేసుతో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని, రాజకీయ కక్షతోనే కేసు వేశారని ఆయన తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే అన్నారు. ఏసీబీ కోర్టులో టీడీపీ నేత తరఫున ఆయన వాదనలు వినిపించారు.
ఒప్పందం ప్రకారం 40 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటయ్యాయి, ఇందులో చంద్రబాబు పాత్ర ఏమిటి? అన్నారు. ఈ కేసుతో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ భోజన విరామం తర్వాత వాయిదా పడింది.