Anjali, Rajasekhar Reddy Pulicharla
హీరోయిన్ అంజలి లీడ్ రోల్ లో 9 క్రియేషన్స్ నిర్మాణంలో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల రూపొందిస్తున్న కొత్త మూవీ ఈ రోజు హైదరాబాద్ లోని మూవీ ఆఫీస్ లో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ చిత్రానికి రాజచంద్రశేఖర్ రెడ్డి కందుల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల గతంలో సుడిగాలి సుధీర్ తో "సాఫ్ట్ వేర్ సుధీర్", "గాలోడు" అనే కమర్షియల్ గా సక్సెస్ ఫుల్ చిత్రాలు రూపొందించి దర్శకుడిగా తన ప్రతిభ నిరూపించుకున్నారు. అంజలితో చేస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ ఫిలిం ఆయన కెరీర్ లో మరో స్పెషల్ మూవీ కానుంది.