హీరోలు తెలుగు నేర్చుకోండి.. పిల్లలకు కూడా తల్లిదండ్రులు? సుప్రీం

సోమవారం, 6 డిశెంబరు 2021 (12:49 IST)
ఘంటసాల శతజయంతి వేడుకల సందర్భంగా తెలుగు సినీ నటీనటులకు హితవు పలికారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. తెలుగు భాషకు సంబంధించి ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. భారతదేశంలోని అతిప్రాచీన భాషల్లో తెలుగు కూడా ఒకటి. అలాంటి తెలుగు భాష.. ఇప్పుడు నిరాదరణకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
తెలుగు భాష ఉచ్ఛారణ బాగా నేర్చుకుని నటిస్తే బాగుంటుందని ఎన్వీ రమణ టాలీవుడ్‌ నటులకు సూచించారు. గాయకులు కూడా తెలుగు సరిగా నేర్చుకుని పాడాలన్నారు. 
 
అప్పట్లో ఎన్టీఆర్‌, ఏఎన్నాఆర్‌ కూడా తెలుగు రాకపోయినా, డ్యాన్స్‌ రాకపోయినా మద్రాస్‌లో కొన్ని నెలల పాటు ప్రాక్టీస్‌ చేశారని, తెలుగు రాకపోతే అవమానంగా భావించవద్దన్నారు. అలాగే ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు తెలుగు నేర్చుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు