ఇప్పుడు తెలుగులో కూడా అలాంటి సినిమాలు వస్తున్నాయి. చిన్న హీరోలు మనోజ్, నారారోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ వంటి హీరోలు కలిసి నటించడం సాధారణమే. దీనికి కారణం ఓటీటీలో వస్తున్న భిన్నమైన కథలు, తారాగణమే కారణంగా నిర్మాతలు చెబుతున్నారు.
తాజాగా చెప్పుకోవాలంటే ఒకప్పుడు విలన్ గా మోహన్ బాబు కు పెద్ద పేరుంది. చాలాకాలం తర్వాత గేప్ తీసుకున్న ఆయన రాజమౌళి యమదొంగ సినిమాలో మళ్ళీ మురిపించారు. ఆ తర్వాత మరలా సినిమాలు చేయలేదు. ఎందుకంటే తన స్థాయికి తగ్గ కథ, హీరో కుదరాలి అనేవారు. తాజా సమాచారం మేరకు మోహన్ బాబు ఓ పెద్ద దర్శకుడు, హీరో నటిస్తున్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఇక మరో ముఖ్య సమాచారం ఏమంటే, ప్రభాస్ నటించనున్న స్పిరిట్ లో మెగాస్టార్ చిరంజీవి నటించనున్నాడని ఫిలింనగర్ కథనాలు వినిపిస్తున్నాయి. ఇందులో ఆయన కామియో రోల్ ప్లే చేయనున్నాడట. అందుకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కసరత్తు చేస్తున్నాడు. ఇప్పటికే ది రాజా సాబ్, ఫౌజీ చిత్రాల షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఈ రెండు చిత్రాల్లో ప్రభాస్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. అయితే, ఆ తర్వాత ప్రభాస్ తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేయబోతున్నాడు. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడట.