అలాగే, ప్లాస్టిక్ ఫ్లెక్సీల ఉత్పత్తి, దిగుమతికి అనుమతి లేదని తెలిపింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీల వినియోగం, ముద్రణ, రవాణా, ప్రదర్శన పైనా నిషేధం విధించింది. ఈ నిషేధం అమలులో నగరాలు, పట్టణాల్లో అధికారులు బాధ్యత వహించాలని ఆదేశించింది.
ఉత్తర్వులు అతిక్రమిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని జీవో జారీ చేసింది. నిషేధం అమలును పోలీస్, రవాణా, జీఎస్టీ అధికారులు పర్యవేక్షించాలని తెలిపింది. ప్లాస్టిక్‌కు బదులుగా కాటన్, నేత వస్త్రాలు వాడాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది.