ఏపీలో జగనన్న హరితవనాలు - నమూనాను ఆవిష్కరించిన సీఎం

మంగళవారం, 7 జూన్ 2022 (20:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు కొత్తశోభను సంతరించుకోనున్నాయి. ఇందుకోసం జగనన్న హరిత వనాలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మంగళవారం పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడులో దీనికి సంబంధించిన నమూనాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. అక్కడే జిందాల్ వేస్ట్ ఎనర్జీ పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. 
 
తొలి విడతలో 45 పట్టణ స్థానిక సంస్థలను (యూఎన్‌బీ) జగనన్న హరిత నగరాలు కార్యక్రమం కోసం ప్రభుత్వం ఎంపిక చేసింది. పచ్చదనం పెంపుతోపాటు వాల్ పెయింటింగ్ తదితర పనులు చేపట్టనుంది. 
 
ఇందుకోసం ఉత్తమం విధానాలను అనుసరించిన 10 పట్టణాలు, నగరాలకు గ్రీన్ సిటీ చాలెంజ్ కింద కోటి రూపాయల చొప్పున రూ.10 కోట్లను బహుమతిగా ఇవ్వనున్నారు. ఇందుకు అవసరమైన చర్యలను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖతో ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్‌ సంస్థలు చేపడుతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు