టీటీడి ఛైర్మన్ పదవి నుంచి వైవీ సుబ్బారెడ్డికి ఉద్వాసన?

బుధవారం, 19 జులై 2023 (09:29 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు పాలక మండలి ఛైర్మన్‌గా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి వైవీ సుబ్బారెడ్డి కొనసాగుతున్నారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైవీ సుబ్బారెడ్డి తితిదే ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఈయన మొదటి విడత పదవీకాలం ముగిసిన తర్వాత రెండోసారి కూడా ఆయనే కొనసాగుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన స్థానంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని నియమించాలని జగన్ నిర్ణయించినట్టు సమాచారం. టీటీడీ బోర్డు నియమాకంపై సమీక్ష అనంతరం జగన్ తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. దీంతోపాటు మరికొన్ని పార్టీ పదవుల్లోనూ మార్పు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త పదవి నుంచి సీనియర్ నేత విజయసాయిని గతేడాది తొలగించారు. 
 
అలాగే, ప్రాంతీయ సమన్వయకర్త పదవికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడా స్థానాన్ని విజయసాయిరెడ్డికి కానీ, లేదంటే మరో నాయకుడికి ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే, మరికొన్ని స్థానాల్లోనూ కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు