గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని ప్రభుత్వ భూమి ఎంత ఉందో గుర్తించాలని, ఇళ్లులేని ప్రతి నిరుపేదకు ఇంటి స్థలం ఇవ్వాలన్నారు. కలెక్టర్ల ఫోకస్ లేకపోతే ఇది సాధ్యం కాదన్నారు. గ్రామ వాలంటీర్లు, సచివాలయాలు త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. ఎంతమందికి ఇళ్లులేవో వీరిద్వారా లెక్కలు అందుతాయన్నారు.
ఇచ్చిన ఇళ్లస్థలం ఎక్కడ ఉందో లబ్ధిదారునికి తెలియని పరిస్థితి ఉండకూడదన్నారు. హౌసింగ్ కోసం రూ.8,600 కోట్లు పెట్టామన్నారు. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా ఇన్ని లక్షల సంఖ్యలో ఇళ్లస్థలాలు ఒకేసారి ఇస్తున్నామన్నారు. కలెక్టర్ల మీదే నా విశ్వాసం, నా బలం కూడా మీరేనని చెప్పారు.