కేసీఆర్ జన్మదినం.. 1.10 లక్షల మొక్కలు నాటారు...

సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (14:46 IST)
సీఎం కేసీఆర్ 66వ జన్మదినం సందర్భంగా సిద్ధిపేట జిల్లాలో లక్షా 10 వేల మొక్కలు నాటుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర మంత్రి టి.హరీష్ రావు తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రజలు సంతోషంగా తమ జన్మదినం జరుపుకున్నట్లు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
ప్రతి గ్రామంలో 200 మొక్కలు ప్రతి మున్సిపాలిటీలో 5 వేల మొక్కలు సిద్ధిపేట సుడా పరిధిలో 5900 మొక్కలు నాటుతున్నాం. నాటిన ప్రతి మొక్కను కాపాడే బాధ్యత తీసుకోవాలి. సీఎం కేసీఆర్ జన్మదినం స్ఫూర్తిగా మీ జన్మదిన రోజున కూడా మొక్కలు నాటాలని ప్రజలను కోరిన మంత్రి హరీశ్ రావు.
 
మీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయడంతో పాటుగా మొక్కను నాటి సంరక్షించాలని ప్రజలను కోరారు. చనిపోయిన వారి పేరు మీద పట్టణంలోని శ్రీ రామ కుంట, ప్రశాంత్ నగర్ స్మశాన వాటికలోని స్మృతి వనం లో మొక్కలు నాటాలి.
 
ఉగాది పండుగ ఈ మార్చి నెల 25 రోజున శార్వరీ నామ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ రోజు శార్వరీ గ్రీన్ పార్క్ ప్రారంభించుకున్నామని, సీఏం కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఈ పార్కు వాకింగ్‌కి చిన్న పిల్లలకు ఆడుకోవడానికి ఉపయోగపడుతుంది. 
 
మొక్కలు నాటే కార్యక్రమంలో విద్యార్థులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొక్కలు నాటడం కన్నా వాటిని సంరక్షించడం గొప్ప పని. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ఆకుపచ్చ తెలంగాణగా జల తెలంగాణగా మార్చుతున్నారు. 
 
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బొట్టు రక్తం చిందకుండా సాధించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరం మొక్కలు నాటి కేసీఆర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుదామని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.
 
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున మొక్కను నాటుతున్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కొనసాగించి మొక్కను సంరక్షిద్దాం. రాబోయే రోజుల్లో పెళ్లిళ్లలో కూడా రిటర్న్ గిఫ్ట్‌గా మొక్కలు బహుమతిగా ఇద్దాం. మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే శుభకార్యాల్లో కూడా మొక్కలను రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి హరిత తెలంగాణలో భాగస్వాములమవుదాం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు