పుట్టి పెరిగిన ఊరును పునర్నిర్మాణం చేసేందుకు చింతలేని చింతమడకగా తీర్చిదిద్దేందుకు విచ్చేసిన ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు గ్రామ ప్రజలందరూ ఉప్పొంగిన గుండెలతో, ఉత్సాహంగా స్వాగతం తెలిపారని తెరాస నేత టి. హరీష్ రావు అన్నారు.
ఆయనను చిన్నప్పటి నుంచి చూసినవాళ్ళు, చిన్ననాటి దోస్తులు ఎవరెవరైతే ప్రేమతో ఈ సమావేశానికి విచ్చేసినారో వారందరికీ, గౌరవ ముఖ్యమంత్రికి సిద్ధిపేట శాసన సభ్యునిగా నేను సాదరంగా స్వాగతం పలుకుతున్నా. "జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ" అన్నారు పెద్దలు. ఉన్నఊరు కన్నతల్లి స్వర్గంకన్నా మిన్న
మీ అందరి ప్రేమను పంచుకొని యావత్ రాష్ట్రం సాదించడం మనందరికీ గర్వకారణం. అందరికి ఊరు గుర్తింపు తెస్తే... మన ఊరికి మన రాష్ట్రానికీ గుర్తింపు తెచ్చిండు మన కే.సి.అర్. మీది ఏ ఊరు అంటే సంగారేడ్దో, సిద్దిపెటనో అంటారు. కానీ మాది కే.సి.అర్. ఊరు అని గర్వంగా చెప్పుకుంటారు చింతమడక ప్రజలు.
మీ ఆశీర్వాదంతో గత కొన్ని సంవత్సరాలుగా గ్రామములో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువుల దవఖానా, బ్యాంక్, సిద్ధిపేట దుబ్బాక డబుల్ రోడ్డు, పాఠశాల నిర్మాణం ఇలా కొన్ని పనులు చేసుకున్నాం. గ్రామ అభివృద్ధిపై, నియోజకవర్గ అభివృద్ధిపై నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను.