సచివాలయం భవనం కూల్చివేత కోర్టు పరిధిలో ఉంది: టి సర్కారుకు షాక్

సోమవారం, 8 జులై 2019 (14:15 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. సచివాలయం, ఎర్రమంజిల్ భవనాలను తమ ఉత్తర్వులు వెల్లడించేంత వరకు కూల్చొద్దని ఆదేశాలు జారీ చేసింది. పైగా ఈ భవనాల కూల్చివేత కోర్టు పరిధిలో ఉందని పేర్కొంది. 
 
అదేసమయంలో ఈ భవనాల కూల్చివేతను అడ్డుకుంటూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ ప్రారంభంకాగానే కౌంటర్‌కు 15 రోజులు గడువు ఇవ్వాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. కానీ, హైకోర్టు మాత్రం సమ్మతించలేదు. సోమవారం మధ్యాహ్నం 2.15కే వాదనలు వినిపించాలని కోర్టు ఆదేశించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు