ఇందులోభాగంగా, రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ పరిధిలోని కార్యక్రమాలు, ఆస్పత్రుల్లో నాడు నేడు, కొత్త వైద్య కాలేజీ నిర్మాణం, కేన్సర్ కేర్ తదితర అంశాలపై సమీక్ష చేశారు.
ఇందులో ఆయన కీలక ఆదేశాలు జారీచేశారు. ఏ తరహా ప్రసవం జరిగినా (సహజ మరణం లేదా సిజేరియన్) ఆరోగ్య ఆసరా కింద రూ.5 వేలు నగదు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సహజ ప్రసవం లేదా సిజేరియన్ ప్రసవం అయినా ఆరోగ్య ఆసరా వర్తింపజేయాలని స్పష్టం చేశారు. అదేసమయంలో సహజ ప్రసవాల సంఖ్య పెంచాలని, ఈ దిశగా మహిళల్లో అవగాహన, చైతన్యం పెంచాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు.