దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి కొత్త గెటప్‌లో కనిపించారు. సూటు, కోటు ధరించి టిప్‌టాప్‌గా రెఢీ అయ్యారు. దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుంది. ఇందులో పాల్గొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందానికి సీఎం జగన్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలపై సీఎం జగన్ పెట్టుబడిదారులకు వివరించనున్నారు.
కాగా, సీఎం జగన్ తొలి రోజున బిజీబిజీగా గడిపారు. ఈ సందర్భంగా ఏపీ పెవిలియన్‌ను ప్రారంభించిన ఆయన వరుసగా అనేక మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ముఖ్యంగా, బీసీజీ గ్లోబల్ ఛైర్మన్ హాన్స్ పాల్ బక్నర్‌తో సమావేశమయ్యారు.
అలాగే, డబ్ల్యూఈఎఫ్ వేదికపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని సీఎం జగన్‌ను కలిశారు. ఏపీలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలను చర్చించారు. అటు, మహారాష్ట్ర టూరిజం మంత్రి ఆదిత్య థాకరే సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
కాగా, ఈ దావోస్ పర్యటనలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, ఈడీబీ సీవీవో జీవీఎన్ సుబ్రమణ్యం తదితరులు ఉన్నారు.