ఫేస్ బుక్ లో పిలిస్తే కలెక్టర్.. ఎవరు? ఎక్కడ?

సోమవారం, 22 డిశెంబరు 2014 (20:53 IST)
సాధారణంగా నేరుగా ఉత్తరం రాస్తే అది తపాలలో చేరిన వారం రోజుల తరువాతగాని పలకని అధికారులు ఎందరో ఉన్నారు. ఇక ఐఏస్ అధికారులకైతే తీరికే ఉండదు. ఇక జిల్లాల్లో కలెక్టరుగా పని చేయడమంటే అంత సులభమేమి కాదు. క్షణం తీరిక లేకుండా తిరగాల్సి ఉంటుంది.
 
ఇలాంటి పరిస్థితులలో ఇక ఫేస్ బుక్కలకు, మెయిళ్ళు, వాట్సప్ లకు పలకడమంటే సాధ్యమా.. కానీ పలకాలి, పరిష్కరించాలనే మనసుండాలేగానీ సమయం దానంతట అదే వస్తుందంటున్నారు  చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్. మామూలుగానే మెయిళ్ల ద్వారా సమాధానం ఇచ్చే ఆయన నేరుగా ఓ ఫేస్ బుక్ అకౌంటును ఓపెన్ చేసి దాని ద్వారా జనమడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతుంటారు. 
 
సమస్యలుంటే పరిష్కారానికి చర్యలు తీసుకుంటుంటారు. బస్సులు తమకు సరియైన సమయపాలనకు రావడం లేదు. ఆలస్యంగా నడుస్తున్నాయని విద్యార్థులు చేసిన ఫిర్యాదులకు ఆయన ఆ శాఖ నుంచి సమాచారం తెప్పించి విద్యార్థులకు పంపడమే కాకుండా పరిష్కారం కూడా చూపించారు. హాట్సాఫ్!! టు మిస్టర్ సిద్ధార్థ జైన్... 

వెబ్దునియా పై చదవండి