ఇటీవల సూసైడ్ చేసుకున్న విజయ్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇన్నాళ్లూ తన భర్త మృతి చెందడానికి తనకూ సంబంధం లేదని చెప్పిన వనితా రెడ్డి పోలీసుల కంట పడకుండా తప్పించుకుతిరుగుతున్నట్లు తెలిసింది. పోలీసులు విచారణలో భాగంగా వనితారెడ్డి ఇంటికి వెళ్లగా, తన కూతురికి అనారోగ్యంగా ఉందని వనిత తల్లి చెప్పినట్లు తెలిసింది.
అయితే వనితారెడ్డి సూర్యాపేటలో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆమె తప్పించుకోవడానికి యత్నిస్తుందేమోనని అనుమానిస్తున్నారు. న్యాయవాది శ్రీనివాస్ కూడా ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు. దీంతో పోలీసులకు ఈ అనుమానం మరింత బలపడింది. ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందని, అరెస్ట్ చేయాలని విజయ్ తండ్రి డిమాండ్ చేస్తున్నారు.