మరి తెలుగు పరిస్థితి ఏమిటి - రేవంత్ రెడ్డి

సోమవారం, 3 జూన్ 2019 (18:09 IST)
హిందీ భాషని దక్షిణాది రాష్ట్రాలలో నిర్బంధ పాఠ్యాంశంగా చేర్చాలన్న కస్తూరిరంగన్ కమిటీ సిఫార్సులపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. హిందీ భాషను దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా రుద్దాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారో కేంద్రం వివరించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేసారు. 
 
ఇది తమ అస్తిత్వంపై జరుగుతున్న దాడిగా భావిస్తున్నామని పేర్కొన్న ఆయన... దేశంలో ఎక్కువమంది మాట్లాడే రెండో భాష తెలుగేననీ, మరి అలాంటప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో తెలుగు భాషను కూడా నిర్బంధ పాఠ్యాంశంగా చేర్చగలరా? అని ప్రశ్నించారు.
 
పాలకుల నిర్లక్ష్యం కారణంగా రెండవ స్థానంలో ఉండిన తెలుగుభాష మూడోస్థానానికి పడిపోయిందని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆక్రోశించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు