అయ్యా అమ్మా, సోడా తాగండి, ఓటు వేయండి, మాజీ కేంద్రమంత్రి చింతా

బుధవారం, 24 మార్చి 2021 (19:38 IST)
తిరుపతి ఉప ఎన్నికల్లో అందరి కన్నా వెరైటీగా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు డాక్టర్ చింతామోహన్. కాంగ్రెస్ పార్టీ అసలు ఇంతవరకు అభ్యర్థినే ప్రకటించకపోయినా తనకు తానుగా ప్రచారం చేసేసుకుంటున్నారు. ఇప్పటికే ఆరుసార్లు ఎంపిగా పనిచేసిన అనుభవంతో పాటు కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు చింతా మోహన్.
 
దీంతో ఈసారి కూడా తనకే సీటు వస్తుందన్న నమ్మకంతో ఆయన ఉన్నారు. చింతామోహన్ తిరుపతి నగరంలో వెరైటీగా ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు ఇస్త్రీ చేస్తున్న వారి దగ్గరకు వెళ్ళి ఇస్త్రీ చేస్తూ.. అలాగే తోపుడు బండ్ల దగ్గరకు వెళ్ళి పండ్లను అమ్ముతూ... వేసవి కాలం కావడంతో చల్లటి మజ్జిగ, లెమన్‌ను అందరికీ ఇస్తూ వెరైటీ ప్రచారం చేస్తున్నారు. 
 
ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దగా కార్యకర్తలు లేకపోయినా, ఆయన ఒంటరిగానే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుపతిలో జరిగిన అభివృద్థిని వివరిస్తూ.. బిజెపి, వైసిపి, టిడిపిలు అసలు తిరుపతిని ఏమాత్రం అభివృద్థి చేయలేదని చెప్పుకుంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు