బెజవాడ దుర్గమ్మ గుడిలో అర్చకుడికి కరోనా, వణికిస్తున్న మహమ్మారి

గురువారం, 25 జూన్ 2020 (18:56 IST)
రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనావైరస్ కేసులు ప్రస్తుతం ఏపీలో రెడ్ బెల్స్ మోగిస్తున్నాయి. ఏపీలో కరోనా కేసులు 10 వేలు దాటిపోయాయి. ఈ నేపధ్యంలో కొన్ని జిల్లాల్లో లాక్డౌన్ ప్రకటించారు. ఇదిలావుంటే బెజవాడ ఇంద్రకీలాద్రిపై లక్ష కుంకుమార్చన నిర్వహించే అర్చకుడికి కరోనాపాజిటివ్ రావడంతో భక్తులు భయాందోళ చెందుతున్నారు.
 
 గుడికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. కాగా దుర్గమ్మ దర్శనాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సాగిస్తున్నారు. తీర్థప్రసాదాలు ఇవ్వడంలేదు. భక్తులు భౌతికదూరం పాటించాలని ఆలయ అధికారులు హెచ్చరిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు